Header Banner

పంజాబ్ పరుగుల సునామీ... లక్నో ముందు భారీ లక్ష్యం! పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో..

  Sun May 04, 2025 22:03        Sports

ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. లక్నో బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారించారు. ఆదివారం జరిగిన ఈ లీగ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 236 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (91) విధ్వంసక ఇన్నింగ్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్, తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలోనే ప్రియాంశ్ ఆర్య (1) వికెట్‌ను పంజాబ్ కోల్పోయినప్పటికీ, మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఏమాత్రం ఒత్తిడికి గురికాలేదు. లక్నో బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 48 బంతుల్లోనే 6 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 91 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.

 

ఇది కూడా చదవండి: యుద్ధం వస్తే దేశం విడిచి పారిపోయేందుకు పాక్ నేతలు రెడీ.. బీజేపీ నేత వ్యాఖ్యలు!

 

దూకుడుగా ఆడే క్రమంలో దిగ్వేశ్ రాఠి బౌలింగ్‌లో పూరన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరోవైపు, వన్‌డౌన్‌లో వచ్చిన జోష్ ఇంగ్లిస్ (14 బంతుల్లో 30; 1 ఫోర్, 4 సిక్సర్లు), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (25 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరూ వేగంగా పరుగులు జోడించడంతో పంజాబ్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. మిడిలార్డర్‌లో నెహాల్ వధేరా (9 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా తన వంతు సహకారం అందించాడు. చివరి ఓవర్లలో శశాంక్ సింగ్ (15 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్కస్ స్టోయినిస్ (5 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) భారీ షాట్లతో చెలరేగారు. వీరిద్దరి మెరుపులతో పంజాబ్ కింగ్స్ 230 పరుగుల మార్కును దాటింది. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో ఆకాశ్ మహరాజ్ సింగ్, దిగ్వేశ్ సింగ్ రాఠి తలా రెండు వికెట్లు పడగొట్టారు. ప్రిన్స్ యాదవ్ ఒక వికెట్ తీశాడు. అయితే, మయాంక్ యాదవ్ (4 ఓవర్లలో 60 పరుగులు), అవేష్ ఖాన్ (4 ఓవర్లలో 59 పరుగులు) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

 

జైలులో మాజీమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం! ఆసుపత్రికి తరలింపు..!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! రూ.3,716 కోట్లతో.. ఆ రూట్లో ఆరు లైన్లుగా నేషనల్ హైవే!

 

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.4 వేలు! ఈ పథకం గురించి తెలుసా, దరఖాస్తు చేస్కోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia